Telangana: మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్.. గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు

ప్రముఖ హీరోయిన్ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్ ఎక్కడ? ఇతడే టార్గెట్‌గా హైదరాబాద్‌ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ మాసబ్ట్యాంక్ డ్రగ్స్ కేసులో అమన్‌ ప్రీత్‌ కోసం ఈగల్‌ టీమ్‌, మాసబ్‌ ట్యాంక్‌ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియాతోపాటు శ్రనిక్ సింఘ్వి అరెస్టుతో వెలుగులోకి వచ్చింది అమన్ ప్రీత్‌ పేరు.

Telangana: మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్.. గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు
Amanpreet Singh

Updated on: Dec 27, 2025 | 3:12 PM

హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో సంచలనంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నప్పటికీ, విదేశీ డ్రగ్స్ నెట్‌వర్క్ మాత్రం కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది. తాజాగా మాసబ్‌ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ పేరు బయటపడటం కలకలం రేపుతోంది.

మాసబ్‌ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ‘ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్‌తో పాటు MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయంతో పాటు, వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ ఉన్నట్లు తేలింది. అతను తరచూ వీరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ కేసులో త్వరలో కీలక అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి