జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గతంలో బలవన్మరణానికి పాల్పడిన చిన్నప్పటి ఫ్రెండ్ గత కొద్ది రోజులుగా కలలోకి వస్తూ.. తనని రమ్మంటోందని ఓ వివాహిత తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. తనకు భయంగా ఉందంటూ.. వాపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బచ్చన్నపేట గ్రామానికి చెందిన పోచంపల్లి కిష్టయ్య కుమార్తె రాధిక (33)కు 15 ఏళ్ల కిందట.. ఖిలాషాపురం గ్రామానికి చెందిన యామంకి సుధాకర్‌తో పెళ్లి జరిపించారు పెద్దలు. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి సంతానం. వారి దాంపత్య జీవితం చక్కగానే సాగిపోతుంది. ఎలాంటి వైవాహిక ఇబ్బందులు లేవు.
కానీ, రాధిక బుధవారం తన అన్నయ్య శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చాలా భయంతో మాట్లాడింది. 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన తన చిన్నప్పటి స్నేహితురాలు ఇటీవల తరచుగా కలలోకి వస్తోందని.. తన దగ్గరికి రావాలని కోరుతుందని.. భయంగా ఉందని చెప్పింది. అలాంటివి ఏం ఉండవని.. పట్టించుకోవద్దని చెల్లికి ధైర్యం చెప్పాడు అన్న. కానీ, రాధిక మనసులో భయం వీడలేదు. ఈ సమస్య తనను వీడనది భయాందోళనకు గురై.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
తనకు ఫోన్ చేసి చెప్పిన కాసేపటికే చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని తెలిసి అన్న షాక్‌కు గురయ్యాడు. మరణవార్త గురించి సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్నేహితురాలి మరణం ఆమెను మానసికంగా కుంగదీసి ఉండొచ్చని.. మానసిక నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…