తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. పోలీస్ ఇన్ ఫార్మర్స్ నెపంతో ఓ ప్రభుత్వ ఉద్యస్తుడితో సహా ఇద్దరిని హతమార్చారు.. తెల్లవారుజామున వారి ఇళ్ల వద్ద నరికి చంపి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ జంట హత్యలు ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగాయి. తెల్లవారుజామున ఎటాక్ చేసిన మావోయిస్టులు ఇరువురిని హతమార్చారు. మృతులు ఈక అర్జున్, ఈక రమేష్ అనే ఆదివాసీలుగా గుర్తించారు.
మృతుడు ఈక రమేష్ ప్రభుత్వ ఉద్యోగి గ్రామ పంచాయతీ సెక్రటరిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిని నరికి చింపిన మావోయిస్టులు సంఘటనా స్థలంలో రెండు లేఖలు వదిలి వెళ్లారు. ఈ లేఖలు వెంకటాపురం – వాజేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఉన్నాయి. మృతుడు రమేష్ పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడని, పక్కనే ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చే వాడని లేఖలో ఆరోపించారు.
SIB డైరెక్షన్ మేరకు ఛత్తీస్‌ఘడ్- తెలంగాణా సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లో స్నేహితులను ఏర్పాటు చేసుకొని మావోయిస్టుల సమాచారం సేకరిస్తున్నాడని లేఖ లో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన పలు ఘాతుకాలకు పంచాయితీ కార్యదర్శి రమేష్ కారణమని లేఖలో పేర్కొన్నారు. వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఈక అర్జున్ చేపలవేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టులు డెన్నులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోక పోవడంతో హతమార్చామని లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..