Telangana: ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి!

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్ గేటు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ షాపింగ్ మాల్‌లో విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Telangana: ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి!
Mancherial Road Accident

Edited By:

Updated on: Sep 28, 2026 | 7:11 PM

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్ గేటు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం, గుడిపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని షాపింగ్ మాల్‌లో పనిచేసేందుకు రోజూ ఆటోలో వెళ్తుంటారు. సోమవారం కూడా విధులకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆటోలో మంచిర్యాలకు బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో మంచిర్యాల కు చేరుకుంటారు అనే సమయంలో నస్పూర్ గేటు వద్దకు చేరుకున్న ఆటోకు ఓ బైక్‌ ఆటోకు అడ్డుగా వచ్చింది. వేగంగా వెళుతున్న ఆటో అడ్డుగా వచ్చిన బైక్ తప్పించే క్రమంలో ఒక్కసారిగా పక్కకు తిప్పాడు‌. అంతే ఆటో అంతే వేగంగా పక్క రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

లారీ ఢీకొట్టిన ధాటికి ఆటో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఇద్దరు మహిళలు ఆటో నుండి ఎగిరి రోడ్డు పై పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మాత్రంక్షేమంగా బయటపడగా.. ఇద్దరు ఘటన స్థలంలోనే మృతి చెందారు.

ఐదుగుకు చేరిన మృతుల సంఖ్య

ఈ ప్రమాదంలో చింతకుంట్ల లక్ష్మి (30), సౌందర్య (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఐదుగురిని స్థానికులు వెంటనే అంబులెన్సుల్లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో సోనియా, సుమలత, అనూష పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

ఘటనపై పోలీసుల దర్యాప్తు

ప్రమాదం విషయం తెలుసుకున్న నస్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ ను సేకరించిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. బైక్‌ను తప్పించబోయే క్రమంలో ఆటో అదుపుతప్పిందని గుర్తించిన పోలీసులు అదే కోణాల్లో విచారణ చేపట్టారు‌. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ ప్రశాంత్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు నస్పూర్ పోలీసులు. ఉదయం విధులకు వెళ్లాల్సిన మహిళలను మృత్యువు వెంటాడటంతో.. పొన్నారం, గుడిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us