Telangana: బైక్ పోయింది.. తెల్లారి వెళ్లి చూస్తే అదే ప్లేస్‌లో కనిపించింది.. ట్విస్ట్ ఏంటంటే..

పాడు బుద్ది కారణంగా కొందరు దొంగతనాలు చేస్తారు. ఫ్యాషన్ కోసం చేసేవాళ్లు కూడా ఉంటారండోయ్. చెడు అలవాట్లకు బానిసై దొంగతనం చేసే వెదవలు కూడా చాలామంది ఉన్నారు సొసైటీలో.

Telangana: బైక్ పోయింది.. తెల్లారి వెళ్లి చూస్తే అదే ప్లేస్‌లో కనిపించింది.. ట్విస్ట్ ఏంటంటే..
Bike Theft

Updated on: Sep 30, 2021 | 9:46 AM

పాడు బుద్ది కారణంగా కొందరు దొంగతనాలు చేస్తారు. ఫ్యాషన్ కోసం చేసేవాళ్లు కూడా ఉంటారండోయ్. చెడు అలవాట్లకు బానిసై దొంగతనం చేసే వెదవలు కూడా చాలామంది ఉన్నారు సొసైటీలో. ఇక అత్యవసరం అయి మరో దిక్కు లేనప్పుడు దొంగతనాలు చేసేవాళ్లు కూడా ఉంటారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అలాంటి దొంగ గురించే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. రామన్నపేట మండలం  సూరారం గ్రామానికి చెందిన బొంత నర్సింహా మంగళవారం మోత్కూరులోని ఓ హాస్పిటల్‌కు వచ్చారు. పక్కనే ఉన్న ఓ వైన్‌షాప్ ఎదుట తన బైక్ నిలిపి ఆస్పత్రికి వెళ్లొచ్చేసరికి బైక్ మాయమైంది. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేదు. దీంతో తన బైక్ చోరీకి గురైందంటూ ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు నర్సింహా. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఓ పని నిమిత్తం మళ్లీ మోత్కూరు వచ్చిన నర్సింహ.. అదే వైన్‌షాప్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు.  ఆశ్చర్యంగా ఆయన బైక్ అక్కడ కనిపించింది.

తన బైక్ దొరికిందన్న ఆనందంగా దాని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన నర్సింహకు ఓ చీటీ కనిపించింది. దానిపై ‘సారీ బాబాయ్‌ ఏమీ అనుకోవద్దు. డబ్బులు అవసరం ఉండి నీ బండి తీసుకొని ఇంటికి వెళ్లాను’ అని రాసి ఉంది. ఆ చీటిని చూసిన నర్సింహాకు అంతా అయోమయంగా అనిపించింది. ఏదైతే అదైంది. మొత్తానికి తన బైక్ దొరికింది అనుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.   వారు వచ్చి వాహనాన్ని, నర్సింహాను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. అయితే బైక్‌ నిజంగానే దొంగతనానికి గురైందా? లేక ఎవరైనా ఆకతాయిగా చేశారా? అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ షురూ చేశారు.

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్

ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి