మరో వ్యక్తితో సన్నిహితంగా కనిపించిన లవర్.. భరించలేక ప్రియుడు ఎంతకు తెగించాడంటే..

అనుమానం పెను భూతం అయింది. ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న అక్కసుతో దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమోన్మాది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అక్కడే రక్తపు మడుగులో పోలీసులు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. నిర్మల్ జిల్లా బైంసాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన తెలంగాణ వాప్తంగా కలకలం రేపింది..

మరో వ్యక్తితో సన్నిహితంగా కనిపించిన లవర్.. భరించలేక ప్రియుడు ఎంతకు తెగించాడంటే..
Extra Marital Affair

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 08, 2025 | 8:03 PM

అనుమానం పెను భూతం అయింది. ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న అక్కసుతో దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమోన్మాది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అక్కడే రక్తపు మడుగులో పోలీసులు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. నిర్మల్ జిల్లా బైంసాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన తెలంగాణ వాప్తంగా కలకలం రేపింది.. ప్రియురాలిని.. ప్రియుడు అత్యంత దారుణంగా చంపిన ఘటన భైంసా పట్టణంలో సోమవారం జరిగింది.. బైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలోని నందన పాయింట్ వద్ద అశ్విని అనే మహిళ (27) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంసర గ్రామానికి చెందిన అశ్విని‌ అనే మహిళకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే భైంసాలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన నగేశ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి ఉంటున్నారు.

ఉపాధికోసం అశ్విని కి టీ పాయింట్ పెట్టించాడు నగేష్.. అయితే ఆ టీ పాయింటే అశ్విని ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతలో మరో యువకుడితో అశ్వినికి పరిచయం ఏర్పడటం.. ఆ యువకుడితో చనువుగా ఉండటం నగేష్ కు నచ్చలేదు. అయితే అశ్వినిపై అనుమానం పెంచుకున్న నగేష్ అశ్వినితో గొడవకు దిగాడు.. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ అదే టీ స్టాల్ లో అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.

సోమవారం ఉదయం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. నగేశ్ చేతిలో అశ్విని హత్యకు గురై.. రక్తపు మడుగులో కనిపించింది. నిందితుడు కూడా రక్తపుమడుగులోనే అశ్విని పక్కనే కూర్చోని కనిపించాడు.

భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నగేశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు‌ వచ్చేంత వరకు నిందితులు మృతదేహాం పక్కనే కూర్చొని రాక్షసానందం పొందడం కలకలం రేపింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..