Telangana: ఒక్కసారిగా కారుకు అడ్డు వచ్చి అతడిని తీసుకెళ్లిపోయారు.. తెల్లారేసరికి విషాద వార్త

|

Apr 17, 2023 | 10:40 AM

భూతగాదాలతో తన కుమారుడిని కిడ్నాప్‌ చేశారని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు దుండగులు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కరుణాకర్‌ మృతదేహం ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఒక్కసారిగా కారుకు అడ్డు వచ్చి అతడిని తీసుకెళ్లిపోయారు.. తెల్లారేసరికి విషాద వార్త
Karunakar Reddy and his family
Follow us on

రంగారెడ్డి జిల్లా తీగాపూర్‌లో దారుణం జరిగింది. ఆదివారం కిడ్నాపైన కరుణాకరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కారును అడ్డగించిన గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కరుణాకర్‌పై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేసి కారు యజమానిపై కూడా ఎటాక్ చేశారు. అనంతరం మరో కారులో కరుణాకర్‌రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన మొబైల్‌ ఫోన్‌ను స్విచాఫ్ చేశారు.

కరుణాకర్‌రెడ్డిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి సమీపంలో హత్య చేసి మృతదేహాన్ని లోకల్ హాస్పిటల్‌కు తరలించారు. కరుణాకర్‌రెడ్డి మరణవార్త విన్న కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం కరుణాకర్‌ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. గతంలో ఓ పత్రికలో విలేఖరిగా పనిచేసిన కరుణాకర్.. ఆ జాబ్ మానేసి..  కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా జాయిన్ అయ్యాడు.  అయితే కొన్ని రోజుల క్రితం డాక్యుమెంటు రైటర్‌గా MRO పక్కన కార్యాలయం ప్రారంభించారు మధుసూదన్ రెడ్డి ..ఈ గ్రామంలో కొన్ని డాక్యుమెంట్ల విషయంలో మధుసూదన్ రెడ్డి కరుణాకర్ రెడ్డిల మధ్య విభేదాలు వచ్చాయి..దీంతన గుట్టు ఎక్కడ బయటకు తెలుస్తుందోనని కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..