Vikarabad Family Murder Case: వికారాబాద్‌లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్‌!

Vikarabad Family Mass murder case: ఆదివారం తెల్లవారు జామున వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను దారుణంగా నరికి చంపింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. యాదయ్య అనే వ్యక్తి భార్య, వదిన, కొడుకును కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు..

Vikarabad Family Murder Case: వికారాబాద్‌లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్‌!
Vikarabad Family Murder Case

Updated on: Nov 02, 2025 | 8:06 AM

వికారాబాద్‌, నవంబర్‌ 2: వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను దారుణంగా నరికి చంపింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. యాదయ్య అనే వ్యక్తి భార్య, వదిన, కొడుకును కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. వరుస హత్యల అనంతరం నిందితుడు యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురిని చంపే ప్రయత్నం చేయగా.. తృటిలో ఆమె తప్పించుకుంది. ఈ ఘటనలో మొత్తం 4 మంది మృతి చెందారు. ఈ హత్యలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అసలేం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాపురం ఉంటున్న యూదయ్య అనే వ్యక్తి భార్య అలవేలు, వదిన హన్మమ్మ, కూతురు శ్రావణిలను కొడవలితో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతుల మరో కూతురు అపర్ణను కూడా యాదయ్య చంపేందుకు యత్నించాడు. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన ఆదివారం (నవంబర్ 2) తెల్లవారుజామున చోటు చేసుకుంది. రోజువారీ కూళీగా పనిచేసే యాదయ్య భార్య అలవేలు పై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుడు యాదయ్య గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున మరోమారు గొడవ పడగా ఇద్దరిని రాజీ చేసేందుకు వచ్చిన వదిన హన్మమ్మతో సహా భార్య, పిల్లలపై యాదయ్య కొడవలితో దాడి చేశాడు. వీరు ముగ్గురు మృతి చెందగా.. మరో కూతురు అపర్ణ మాత్రం తప్పించుకుంది.

హత్యల అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్న డీఎస్పీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.