Telangana: కోతిని అతి సమీపంగా చూసి ఆగిన గుండె.. కరీంనగర్‌లో విషాదం

తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడింది కోతి. కేకలు వినిపించడంతో లేచిన వ్యక్తి.. సడెన్‌గా కోతిని ఎదురుగా చూసి గుండెపోటుతో మృతిచెందాడు.

Telangana: కోతిని అతి సమీపంగా చూసి ఆగిన గుండె.. కరీంనగర్‌లో విషాదం
Man Dies
Follow us

|

Updated on: Sep 14, 2022 | 9:03 AM

కోతి భయం ఓ వ్యక్తి  ప్రాణం తీసింది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ ఘటన కరీంనగర్‌(Karimnagar)లో చోటుచేసుకుంది. నగరంలోని హనుమాన్‌ నగర్‌లో రుద్రోజు రాజు(45) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయాన్నే నల్లా నీళ్లు రావడంతో.. బిందెల్లో పట్టేందుకు రాజు భార్య తలుపులు తీసి బయటకు వెళ్లింది. ఇంతలోనే మాయదారి కోతి ఇంట్లోకి దూరింది. ఆ సమయంలో రాజుతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు లోపల నిద్రపోతున్నారు. కాగా లోపలికి వెళ్లిన కోతి.. కుమారుడికి సమీపించడాన్ని గమనించిన సరస్వతి.. కోతి.. కోతి అంటూ గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో భార్య కేకలు విన్న భర్త ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అతి సమీపంగా కోతి కనిపించడంతో.. షాక్‌ గురై… కో…తి అంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కరీంనగర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రాజు హార్ట్ అటాక్‌తో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కోతుల మంద తమను తెగ విసిగిస్తోందని.. వాటి కారణంగా ఇప్పుడు ఓ ప్రాణం పోయిందని.. ఇప్పటికైనా అధికారుల చర్యలు తీసుకోవాలని హనుమాన్‌నగర్‌ వాసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు