Telangana: రాత్రైతే చాలు ఆ ఊర్లో తగలబడుతున్న వాహనాలు.. ఓ రోజు సీక్రెట్‌గా కెమెరా పెట్టగా

రాత్రైతే చాలు ఆ ఊర్లో వాహనాలు తగలబడిపోతున్నాయి. ఏం జరుగుతుందో అంతుబట్టడం లేదు.. పోలీసుల వద్దకు వెళ్లగా వారు.. సీసీ కెమెరాలు పెట్టమని సూచించారు. ఆ పని చేయగా.. ఓ రాత్రి గుట్టు వీడింది. వాహనాలు తగలబెడుతుంది ఎవరో తేలిపోయింది. వివరాలు ఇలా....

Telangana: రాత్రైతే చాలు ఆ ఊర్లో తగలబడుతున్న వాహనాలు.. ఓ రోజు సీక్రెట్‌గా కెమెరా పెట్టగా
Caught On Cam

Edited By: Ram Naramaneni

Updated on: Mar 14, 2024 | 1:46 PM

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. ఒకటి కాదు రెండు పది రోజులుగా ఈ ఘటనలు పునరావృతం అవుతుండటంతో అసలు ఈ బైకులను తగలబెడుతోంది ఎవరో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు గ్రామస్థులు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా పోలీసుల సూచనలతో‌ ఇంటికో సీసీ కెమెరా అమర్చుకోవడంతో అసలు బాగోతం బయటపడింది.

పది రోజులుగా గ్రామానికి చెందిన వారి ద్విచక్ర వాహనాలు తగలబడుతుండటంతో అలర్ట్ అయిన స్థానికులు‌ ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. తమ వాహనాలకు నిప్పు పెడుతున్న దుండగులు ఎవరో తెలుసుకునేందుకు నిద్ర లేని రాత్రులుగడిపారు. ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎప్పటిలాగే వచ్చి ఓ ఇంటి ముందు‌పార్క్ చేసిన బైక్ కు నిప్పటించాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు గుట్టు రట్టైంది. నిందితుడు అదే గ్రామానికి‌ చెందిన 23 ఏళ్ల యువకుడు కావడం.. పక్కా అర్థరాత్రి 1 గంట దాటిన తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లను టార్గెట్ చేస్తూ నిప్పంటించి తగలబెట్టినట్టుగా తేలింది. అసలు బైక్ లను దహనం చేయడం వెనుక కుట్ర కోణం ఉందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..