Singareni Job Notification : తెలంగాణ సింగరేణి కొలువుల జాతరకు భారీగా పోటీ పెరిగింది. ఒకేసారి ఇంటర్నల్‌లో ఇతరులకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అర్హులైన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన సింగరేణి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 372 ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణి అంతర్గత అభ్యర్థులకు 879 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 1న ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1,251 ఖాళీలు ఉన్నాయి.
ఖాళీల భర్తీకి సింగరేణి విడుదల చేసిన నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్హతల ఆధారంగా నిర్వహించే పరీక్షల్లో ఎక్కువగా మెంటల్ ఎబిలిటీతో పాటు వర్తమాన విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
సింగరేణిలో ఉద్యోగాలు దక్కించుకోవడానికి అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉండటంతో కష్టపడి ఉద్యోగం దక్కించుకోవడానికి మరింత కష్టపడుతున్నారు. ఇప్పటికే సింగరేణికి బయటి వారి నుంచి పది వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్గత అభ్యర్థుల నుంచి కూడా పోటీ ఉండటంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సింగరేణి సమాయత్తమవుతోంది.
Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అనసూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..