మహాత్ముడికి ఆలయం..ఈ గుడికి ఒక్కసారి వెళితే చాలు..

సాధారణంగా దేవుళ్లకు గుడిలు కట్టి పూజిస్తాం... మొక్కులు చెల్లించుకుంటాం. మన దేశంలో దేవతలతో పాటు పలువురు ప్రవక్తలు, స్వామీజీలు, సినిమా యాక్టర్లకు కూడా కొందరు ఆలయాలను కట్టించారనే వార్తలు విన్నాం.. మన స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహాత్మ గాంధీకి కూడా ఆలయం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మహాత్ముడికి ఆలయం..ఈ గుడికి ఒక్కసారి వెళితే చాలు..
Mahatama Gandhi Temple

Edited By:

Updated on: Oct 02, 2024 | 2:05 PM

సాధారణంగా దేవుళ్లకు గుడిలు కట్టి పూజిస్తాం… మొక్కులు చెల్లించుకుంటాం.. మన దేశంలో దేవతలతో పాటు పలువురు ప్రవక్తలు, స్వామీజీలు, సినిమా యాక్టర్లకు కూడా కొందరు ఆలయాలను కట్టించారనే వార్తలు విన్నాం.. మన స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహాత్మ గాంధీకి కూడా ఆలయం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడి స్మృతులు భావి తరాలకు అందించాలని, దేశానికి జాతిపిత గాంధీ చేసిన సేవలను ముందు తరాలు తెలుసుకోవాలనే ఆలోచనతో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఆయనకు దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాద్- విజయవాడ హైవేని అనుకొని నాలుగు ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించింది. ఈ గుడికి 2012లో భూమి పూజ చేయగా.. 2014, సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆ ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి క్రమం తప్పకుండా గాంధీ ఆలయానికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు.

రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయంలో భవనం పైఅంతస్తులో ప్రధాన ఆలయం ఉంది. కింద ఫ్లోర్‌లో భక్తులు ధ్యానం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో “ఓం నమో భగవతే గాంధీ దేవాయ నమో నమః” అనే మంత్రంతో దేవుళ్లతో సమానంగా మహాత్ముడికి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రధాన పూజారి నరసింహ చారి సుప్రభాతం కీర్తనలతో తెరుస్తారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, పంచభూతాల ఆలయాలు కూడా ఉన్నాయి. 30 పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టిని ఇక్కడ భద్రపరచారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహెబ్ వంటి భిన్న మతాల గ్రంథాలను ఈ ఆలయంలో ఉంచారు. చిట్యాల సమీపంలోని గ్రామస్తులు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ గుడికి ఒక్కసారి వెళితే చాలు..కోరికలు తీరుతాయని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు.