Teacher-Delivery Boy: ఒకప్పుడు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన టీచర్.. నేడు బ్రతుకు పోరాటంలో డెలివరీ బాయ్‌గా..

|

Sep 02, 2021 | 12:14 PM

Teacher Turn Delivery Boy: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేకరంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా విద్యారంగంపై కోవిడ్ ప్రభావం భారీగా పడింది..

Teacher-Delivery Boy: ఒకప్పుడు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన టీచర్.. నేడు బ్రతుకు పోరాటంలో డెలివరీ బాయ్‌గా..
Amazon Delivery Boy
Follow us on

Teacher Turn Delivery Boy: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేకరంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా విద్యారంగంపై కోవిడ్ ప్రభావం భారీగా పడింది. ఓ వైపు విద్యార్థులకు చదువులపై .. మరోవైపు వైపు చదువులు చెప్పే టీచర్స్ పై కరోనా చూపించిన ప్రభావం గురించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం. కరోనా వైరస్ ఎంతోమంది ఉపాధిని కోల్పోయేలా చేసింది. వారిలో ఎక్కువగా ప్రయివేట్ టీచర్స్ ఉన్నారు. ఉన్నత విద్యనభ్యసించి.. స్కూల్స్ లో, కాలేజీల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు ఇప్పటివరకూ ఎందరో ఉన్నారు. అయితే కరోనా సమయంలో ఫీజులు సరిగా వసూలు కాలేదంటూ.. పనిచేసే స్కూల్ యాజమాన్యం టీచర్స్ కు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో.. చాలామంది టీచర్స్ దొరికిన ఉపాధిపనులకు వెళ్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠాలు చెప్పే ఒక టీచర్ డెలివరీ బాయ్ గా మారారు. వివరాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్ జిల్లా గార్ల కు చెందిన మోత్కూరు రవి కుమార్ పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసి.. బీఈడీ పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ఓ ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు.  పేరున్న కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా కూడా ఉద్యోగం చేశారు.  ఇక ప్రైవేట్ విద్యాసంస్థకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.  అయితే కరోనా వైరస్ ప్రభావం ఇతని జీవితంపై పడింది.. జీవన విధానాన్ని .. వృత్తిని కూడా మార్చేసింది.

పనిచేస్తున్న స్కూల్ యాజమాన్యం ఇక జీతాలు ఇవ్వలేమని.. టీచర్స్ ఎవరిదారి వారు  చూసుకోవాలని చెప్పాయి. కొంతమందిని ఉద్యోగాలనుంచి తొలగించాయి. మరికొందరికి అరకొరగా జీతాలు ఇస్తున్నాయి. ఇంకొందరు కుటుంబ పోషణ కోసం స్వచ్చంధంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు.  ఇలాంటి పరిస్థితిలో రవికుమార్ ఉద్యోగం కోల్పోయారు. కుటుంబ పోషణ కోసం అమెజాన్ లో డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యారు. పాఠాలు చెప్పే టీచర్ నేడు వస్తువులను గుమ్మం గుమ్మానికి అందిస్తున్నారు. ఒకప్పుడు రూ. 30 వేల వరకు జీతం తీసుకున్న రవి కుమార్, ఇప్పుడు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 12వేలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు వందల మంది విద్యార్థులకు చదువు చెప్పి.. వారి భవిష్యత్ కు బాటలు వేసిన టీచర్స్ ఇప్పుడు బ్రతుకు పోరాటంలో కూలీలుగా మారిన వారు ఎందరో..

Also Read:   ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు.. నాటి చిన్నారి కళ్యాణ్ బాబు నుంచి నేటి వరకూ అరుదైన ఫోటోలు మీకోసం..