MLA Shankar Nayak : పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అటవీ అధికారులను హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది అత్యుత్సాహంతో పోడు రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిసార్లు హెచ్చరించిన సిబ్బంది దూకుడు ఆపడం లేదన్నారు. వర్షాలు పడగానే పోడు భూములలో కందకాలు తీయడం రైతులు ఆందోళన చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఆమాయక రైతుల పై దాడులు చేయడం, భూములు లాక్కోవడం ఆపకపోతే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టెవాడ పరిధిలోని పోడు భూముల్లో కాందకాలు తీయడానికి అటవీశాఖ సిబ్బంది వస్తున్నారని తెలియగానే ఆయనే స్వయంగా పోడు భూముల వద్దకు వెళ్లారు. జేసిబీలతో కందకాలు తీయడానికి వచ్చిన అటవీశాఖ సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిబ్బందిని, వాహనాలను తిప్పి పంపించారు. చాలాసేపు అక్కడే ఉండి పోడు రైతులకు మద్దతుగా నిలిచారు. అక్కడే నేలమీద కూర్చుని భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అటవీ శాఖ సిబ్బందిపై పలు ఆరోపణలు చేశారు.
అటవీశాఖ సిబ్బంది వందలాది ఎకరాల పోడు భూములు అమ్ముమున్నారని తన వద్ద అన్ని ఆధారలున్నాయన్నారు. అనంతరం పోడు రైతులను కూడ హెచ్చరించారు. అడవులను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిది అని గుర్తు చేశారు..2005 సంవత్సరంకు ముందు నుండి సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలుంటే ఆ భూమలకు పట్టాలు ఇప్పించే భాద్యత తనదేనని హామి ఇచ్చారు. త్వరలోనే సిఎం కేసిఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని బాధిత రైతులకు భరోసా కల్పించారు.