Telangana: ‘నన్ను మోసం చేసిన వారు కాసుకోండి’.. మాజీ ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్‌..

| Edited By: Narender Vaitla

Dec 15, 2023 | 7:24 PM

మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉగ్ర నరసింహుడయ్యారు. తనను ఓడించడానికి కుట్రలు చేసిన స్వంత పార్టీ నేతలకు ఊర మాస్ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది..? ఆయన్ను మోసం చేసింది ఎవరూ..? ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు..? 'పార్టీలో ఉండి ఎవరు, ఏ మోసం చేశారో చూపిస్తా... నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి. ఇంకా నన్ను ఎవరు ఏం చేస్తారు...

Telangana: నన్ను మోసం చేసిన వారు కాసుకోండి.. మాజీ ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్‌..
Representative Image
Follow us on

తనను మోసం చేసిన వారు కాసుకోండని మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌. ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఇంతకీ శంకర్‌ వార్నింగ్‌ ఎవరికిచ్చారు.? ఆయనను మోసం చేసింది ఎవరు.? అన్న విషయాలను తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉగ్ర నరసింహుడయ్యారు. తనను ఓడించడానికి కుట్రలు చేసిన స్వంత పార్టీ నేతలకు ఊర మాస్ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది..? ఆయన్ను మోసం చేసింది ఎవరూ..? ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు..? ‘పార్టీలో ఉండి ఎవరు, ఏ మోసం చేశారో చూపిస్తా… నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి. ఇంకా నన్ను ఎవరు ఏం చేస్తారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమావేశంలో కార్యకర్తల దుఃఖంను చూసి శంకర్ నాయక్ ఆవేశం కట్టలు తెంచుకుంది. భయపడకండి కార్యకర్తలను కాపాడుకునే సత్తా నాకు పుష్కలంగా ఉంది. మీరు రాత్రి 12 గంటలకు ఆపద వచ్చిన ఫోన్ చేయండి వస్తానని కార్యకర్తలకు శంకర్‌ నాయక్‌ ధైర్యం చెప్పారు. ‘నీకు ధైర్యం ఉంటే నా కార్యకర్తను ముట్టుకో, తర్వాత ఏమైతదో చూసుకో… నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి. త్వరలో నా కూతురును అమెరికా పంపిస్తా… కొడుకును సివిల్ ఇంజనీరింగ్ పంపిస్తా… ఇక చూసుకోండి ఒక్కొక్కరిని ఆడుకుంటా, వేట మొదలైంది’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

శంకరన్న ఇంకా మాట్లాడుతూ.. ‘ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉండే కాబట్టే అలోచించి కంట్రోల్‌లో ఉన్నా. ఇప్పుడు నన్ను ఆపేటోడు లేడు, ఎవ్వరైనా సరే గజగజ వణుకాల్సిందే. నా పై విమర్శలు చేసినవాళ్లు, తప్పులను నిరూపించాలని సవాల్‌ విసిరారు. మనం ఎవ్వరి జోలికి పోవొద్దు, మన జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గతంలో ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బంది పెడితే, ఎలా అయితే వచ్చానో.. ఇప్పుడు అంతకన్నా మెరుపు వేగం తో వస్తాను.

మీకు అండగా నిలబడుతా… ఇంతకు ముందు ఎవరిని ఏమైనా అనాలంటే ఎమ్మెల్యే పదవి అడ్డం ఉండే, ఇప్పుడు ఐ డోంట్ కేర్, నన్ను ఆపేటోడు లేడు. నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది. తన ఓటమికి కారణమైన ఎమ్‌ఎల్‌సీని ఉద్దేశించే మాట్లాడారని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..