US Elections 2024: కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలని భారత్‌లో వివిధ చోట్ల పూజలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్యామల గోపాలన్ పౌండేషన్ నేతృత్వంలో అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ గెలుపు కోసం యాగం చేస్తున్నారు.

US Elections 2024: కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
Maha Yagna For Kamala Harris

Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 05, 2024 | 5:23 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్యామల గోపాలన్ పౌండేషన్ నేతృత్వంలో అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ గెలుపు కోసం యాగం చేస్తున్నారు. గత 11 రోజులుగా వేద పండితులతో చేస్తున్న శ్రీ శ్రీ శ్రీ రాజాశ్యామలంబ సహిత శత చండిపూర్వక మహ సుదర్శన యాగంలో పలువురు ప్రముఖులతో పాటు స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమెరికాలో కమలా హారిస్ గెలవడం వల్ల స్వదేశానికి ఎంతో గర్వకారణంగా ఉంటుందని యాగంలో పాల్గొన్నవారు చెబుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి