Bonalu – 2024: కనుల పండువగా లష్కర్ బోనాలు.. మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

|

Jul 21, 2024 | 2:07 PM

అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి. నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

జంటనగరాల ప్రజలకు ఇవాళ ఫెస్టివల్‌ సండే. సికింద్రబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సందడి కనిపిస్తోంది. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్‌, అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు.

అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి. నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. తెల్లవారుజామునుంచే అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రముఖులు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…