Pig butchering scam: పందులకు మంచి ఆహారం పెట్టి వధించినట్లు.. మిమ్మల్ని ఇలా ముంచేస్తారు జాగ్రత్త

| Edited By: Ram Naramaneni

Jan 04, 2025 | 8:41 PM

గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రధాన టార్గెట్‌గా 'పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌‌తో సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. గూగుల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్, ఫేస్ బుక్ వంటి వాటిని వాడుకుంటూ మోసాలకు తెగబడుతున్నారు. దీంతో ప్రజలను హెచ్చరిస్తూ కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది..

Pig butchering scam: పందులకు మంచి ఆహారం పెట్టి వధించినట్లు.. మిమ్మల్ని ఇలా ముంచేస్తారు జాగ్రత్త
Pig Butchering Scam
Follow us on

సైబర్ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పుడు, ఎలా మోసపోతామో తెలియడం లేదు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఎక్కడో చోట బోల్తా పడుతూనే ఉన్నారు. రోజురోజుకు సైబర్ క్రైమ్ కేసులు కుప్పులు తెప్పులుగా పెరిగిపోతున్నాయి. తాజాగా ‘పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌’ ట్రెండింగ్‌లో ఉంది. తేలికగా మోసపోయే వ్యక్తులను.. సైబర్ కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. అంటే పేదలు, నిరుద్యోగులు,గృహిణులు, స్టూడెంట్స్ అనమాట. నమ్మకం కలిగేలా మాట్లాడుతూ వారికి క్లోజ్ అవుతారు. క్రిప్టో లేదా ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్ మెథడ్స్ చెబుతూ భవిష్యత్ అదరహో అంటూ వారిని స్లోగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేలా పాచికలు వేస్తారు. ఆ తర్వాత ఆ నగదును మాయం చేస్తారు. ఈ మోసాలను పిగ్‌ బుచరింగ్‌ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. పందులను చంపే ముందు.. కసాయి.. వాటికి మంచి ఆహారం అందించే కోణంలో ఈ పదం పుట్టింది. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సూచించింది. ఈ మధ్యకాలంలో ఇలానే ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారని తెలిపింది. ఇందుకోసం మోసగాళ్లు ఫేస్‌బుక్, గూగుల్ వేదికలను వాడుతున్నారని.. వెల్లడించింది. ఈ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు.. హోంశాఖ తన ఆధ్వర్యంలోని.. ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌‌ను రంగంలోకి దింపింది.

2016లో మొదటిసారిగా చైనాలో ‘పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌’ స్కామ్ మొదలైనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని ‘ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌’ అని కూడా పిలుస్తారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లాభదాయకమైన స్కీమ్ అని కమిట్ అయ్యారో.. మీ ఖాతాల్లోని సొమ్ము అంతా ఖతం అవుతుంది జాగ్రత్త.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి