Road Accident: విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే 64పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నడిరోడ్డుపై లారీ దగ్ధమైంది. దాంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడ వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 64పై ప్రయాణిస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే లారీ నుంచి దిగిపోయాడు. క్షణాల్లోనే లారీ కాలిబూడిద అయిపోయింది. రోడ్డుపై లారీ దగ్ధమవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించడంతో.. వారు సైతం ఘటనా స్థలానికి చేరుకుని లారీ అంటుకున్న మంటలను ఆర్పేశారు. లారీ దగ్ధం అవడంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ కలుగలేదు.
Also read:
Megastar Chiranjeevi: సాయిపల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేసి మెగాస్టార్.. అసలు కారణం ఇదే..