Lightning Strikes: తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోన్న పిడుగులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

|

Jul 08, 2021 | 7:28 PM

పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. సీజన్ ఆరంభంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో పడ్డ పిడుగులకు మనుషులు, పశువులు మృత్యువాత పడితే..

Lightning Strikes: తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోన్న పిడుగులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Lightning Strikes
Follow us on

పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. సీజన్ ఆరంభంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో పడ్డ పిడుగులకు మనుషులు, పశువులు మృత్యువాత పడితే.. జోరున కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరదలతో చెరువు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు, పెద్దవాగుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంది. వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాల్లో సుమారు 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇద్దరు.. నిర్మల్‌ల్లో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు.

ఏపీలోనూ భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడటంతో ఒకరు మృతి చెందారు. విజయనగరం జిల్లా ఏజెన్సీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. చెట్లు రహదారులకు అడ్డంగా పడిపోయాయి. పలు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఉరుములు, పిడుగుల నుంచి బయటపడటానికి NDMA నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోనూ వర్షాలు వదలడం లేదు. ఉదయం నుంచే భారీగా వర్షం కురుస్తోంది. కాగా ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందే.. ఆయా ఏరియాల్లోని ప్రజలకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సందేశాలు పంపుతున్నారు. వాటిని ఫాలో అయ్యి.. జాగ్రత్తగా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోచ్చు.

Also Read: ‘గోల్డెన్ కపుల్’.. ఒంటిపై మాత్రమే కాదు, ఆ దంపతుల చెప్పులకు, సెల్‌ఫోన్లకు కూడా బంగారమే

పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుకలా.. ?? ఎక్కడ..??