Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రెడీ .. విపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్

|

Aug 02, 2023 | 10:15 AM

Telangana Assembly session: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇన్ని రోజులు ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలు తట్టుకొని ఎన్నికల్లో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై బీఆర్ఎస్​ పార్టీ దృష్టి సారించింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించేందుకు తమ ప్రణాళికలు రచిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.. ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు గురువారం నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో వివిధ అంశాల్లో విపక్షాలపై దాడి చేసేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రెడీ .. విపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్
Telangana Assembly Sessions
Follow us on

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నాయి అధికార, విపక్ష పార్టీలు. ప్రతిపక్ష నాయకులు ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది అధికార పార్టీ బీఆర్ఎస్. ఎన్నికల్లో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై బీఆర్ఎస్​ పార్టీ దృష్టి సారించింది. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.. ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు గురువారం నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో వివిధ అంశాల్లో విపక్షాలపై దాడి చేసేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీఆర్​ఎస్.. ఇందు కోసం వ్యూహానికి పదును పెడుతూ​ జోరు పెంచింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే టార్గెట్‌గా ప్లాన్ చేస్తోంది. ఇలాంటి చాలా అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమకు కలిసి వస్తుందని.. ఆర్టీసీ కార్మికుల నుంచి సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తోంది.

ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా..

ప్రస్తుత ప్రభుత్వానికి మంత్రివర్గ సమావేశాలు మరోసారి జరగడానికి అవకాశమున్నా.. రేపటి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలే చివరివి కానున్నాయి. సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా బీఆర్​ఎస్​ తొలి విడత అభ్యర్థుల లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలి జాబితాలోనే 85 నుంచి 90 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించే అవకాశం ఉంది. ఇక తప్పదు.. కొంతకాలం వేచి చూసే స్థానాలు తప్ప.. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

వర్షాలే ఆయుధంగా..

ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగి రైతులు నష్టపోవడంపై హాట్ హాట్ చర్చ జరగనుంది. ఇదే అంశంపై ప్రభుత్వం పై విపక్షాలు విమర్శల దాడి చేసేందుకు అవకాశముంది. ఇందే అంశాన్ని తమకు అనుకూలంగా మర్చుకుని.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం.. ఇంతలా వర్షాలు కురిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికసాయంపైనా వివరాలను సిద్ధం చేస్తోంది. మొత్తం మీద రానున్న రోజుల్లో బీఆర్​ఎస్​ మరింత దూకుడు ప్రదర్శించి… ఎన్నికల రంగంలోకి దూకే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం