Viral News: తెలంగాణలో వింత ఘటన.. నిజామాబాద్ జిల్లాలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల.. క్యూ కట్టిన జనాలు..

|

Sep 01, 2021 | 8:45 AM

వింత జననం గురించి చాలాసార్లు వినే ఉంటాం. ఇక ప్రపంచంలో చాలా చోట్ల వింత వింత శిశువులు, జంతువులు జన్మించిన ఘటనలు

Viral News: తెలంగాణలో వింత ఘటన.. నిజామాబాద్ జిల్లాలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల.. క్యూ కట్టిన జనాలు..
Viral Pic
Follow us on

వింత జననం గురించి చాలాసార్లు వినే ఉంటాం. ఇక ప్రపంచంలో చాలా చోట్ల వింత వింత శిశువులు, జంతువులు జన్మించిన ఘటనలు చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా మరోసారి ఇలాంటి వింత ఘటనే జరిగింది. అది కూడా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రెండు తలలతో ఉన్న ఓ గొర్రె పిల్లకు జన్మనిచ్చింది.

తెలంగాణలో వింత ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ గొర్రె.. రెండు తలలతో ఉన్న గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల జనాలు ఈ వింత గొర్రె పిల్లను చూడటానికి క్యూ కడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్‏కు గొర్రెల మంద ఉంది. ఆ మందలోని ఓ గొర్రె ఇటీవల ప్రసవించింది. ఆ గొర్రె రెండు తలలతో ఉన్న గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. శరీరం, కాళ్లు పూర్తిగా సాధారణ గొర్రె మాదిరిగానే ఉండి.. తలలు మాత్రం రెండుగా వచ్చిన వింత గొర్రె పిల్ల జన్మించింది. దీంతో ఈ విషయం కాస్త చుట్టు పక్కల గ్రామాలకు తెలిసిందే. ఈ వింత గొర్రె పిల్లను చూడటానికి జనాలు భారీగా తరలివస్తున్నారు. ఇక ఈ విషయం అధికారుల వరకు వెళ్ళడంతో ఆ వింత గొర్రెను పరిశీలించడానికి అధికారులు సైతం తొగరి లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ గొర్రెకు చెక్ చేసారు. జన్యు లోపంతోనే ఈ రకంగా జన్మించి ఉండవచ్చని పశు వైద్య అధికారులు చెబుతున్నారు.

Also Read: Maharashtra: ఆక్రమణలను అడ్డుకున్న అధికారిపై దాష్టీకం.. మందలించిన పాపానికి మునివేళ్లనే నరికేశారు..

Road on High Altitude: రికార్డు సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిని నిర్మించిన భారత్ ఆర్మీ.. ఎక్కడంటే..

Soldiers Nicole Gee: చిన్నారిని లాలించిన సైనికురాలు ఇక లేరు.. కాబూల్‌ బాంబు పేలుళ్లలో గాయపడి దుర్మరణం

Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..