Telangana: కిడ్నీ తొలగించారు.. పక్కటెముకలు విరిగాయి.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి చూస్తే కన్నీళ్లే..

Lady Constable Soumya Incident: నిజామాబాద్‌లో గత శుక్రవారం గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.. సౌమ్యకు చికిత్స కొనసాగుతోందని.. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే.. కానిస్టేబుల్ సౌమ్య కిడ్నీ తొలగించారు.. రెండు వైపులా పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.

Telangana: కిడ్నీ తొలగించారు.. పక్కటెముకలు విరిగాయి.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి చూస్తే కన్నీళ్లే..
Lady Constable Soumya Incident

Updated on: Jan 26, 2026 | 5:00 PM

Lady Constable Soumya Incident: నిజామాబాద్‌లో గత శుక్రవారం గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.. సౌమ్యకు చికిత్స కొనసాగుతోందని.. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే.. కానిస్టేబుల్ సౌమ్య కిడ్నీ తొలగించారు.. రెండు వైపులా పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్యకు వైద్యం అందుతోంది. ఆస్పత్రికి వెళ్లి సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. సౌమ్య వైద్యం కోసం ప్రభుత్వం రూ.10 లక్షల సాయం అందించింది. సౌమ్య పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని మంత్రి దామోదర ప్రకటించారు.

సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే ఎంతో ఇష్టం. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. గంజాయి మాఫియాను పట్టుకునేందుకు వెళ్లిన సౌమ్య.. అదే ముఠా కారణంగా ఆస్పత్రిపాలు అవుతుందని ఊహించలేకపోయామంటోంది సౌమ్య తల్లి. సౌమ్య ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని ఆమె తమ్ముడు డిమాండ్ చేస్తున్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సౌమ్యను చూసి ఆమె కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.

అసలేం జరిగిందంటే..

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యను ఢీకొట్టారు.. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.. మొదట ఆమెను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.. ఆ తర్వాత నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. ఎక్సైజ్‌ సీఐ స్వప్న ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌ సౌమ్యను కారుతో ఢీకొట్టిన సోహెల్‌, రాహిల్‌, మతిన్‌తోపాటు మరొకరిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..