Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల వేగవంతం.. దృష్టి సారించిన రేవంత్ సర్కార్..

| Edited By: Balaraju Goud

Feb 24, 2024 | 3:10 PM

బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెంలో చేపట్టిన యాదాద్రి అల్ట్రా మెగా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం' ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే వైటీపీఎస్‌ పనుల పురోగతిని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించి పరిశీలించారు. వైటీపీఎస్‌‌లో ఉన్నతాధికారులతో ముగ్గురు మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల వేగవంతం.. దృష్టి సారించిన రేవంత్ సర్కార్..
Bhatti Vikramarka
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించే దిశగా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వైటీపీఎస్‌లో కీలకమైన ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తవడంతో పనులు వేగవంతం చేయాలని జెన్‌కో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో సెప్టెంబరు నాటికి రెండు యూనిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెంలో చేపట్టిన యాదాద్రి అల్ట్రా మెగా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం’ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే వైటీపీఎస్‌ పనుల పురోగతిని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించి పరిశీలించారు. వైటీపీఎస్‌‌లో ఉన్నతాధికారులతో ముగ్గురు మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ప్లాంటులో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది? బొగ్గును తరలించడానికి రైల్వే ట్రాక్‌ నిర్మాణం పురోగతి, గతంలో చేసిన పనుల్లో బిల్లుల చెల్లింపులు, రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు, ఇంకా ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి ఉంది.. తదితర అంశాలపై మంత్రులు జెన్‌కో అధికారులతో సమీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ పవర్, రెనేవబుల్ ఎనర్జీ వైపు వెళ్తుంటే గత పాలకులు థర్మల్ పవర్ వైపు దృష్టిసారించారనీ మంత్రులు చెప్పారు.

పలు కారణాలతో ఇప్పటికే జాప్యం చేయడం మూలంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్లాంట్ లో ఉన్న స్కిల్ అండ్ స్కిల్డ్ కలిగిన వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు. ప్లాంట్ కు అవసరమైన మెటీరియల్ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలు శరవేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైతే ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

గ్రీన్ పవర్ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వచ్చేటప్పటికీ యాదాద్రి థర్మల్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తి జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్లాంట్ పనులు చేపట్టిన ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ తొలి దశ పూర్తి చేయకపోతే సంస్థకు చెడ్డ పేరు వస్తుందని విషయాన్ని ఆ సంస్థ అధికారులు గుర్తించాలని అన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని భట్టి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిా…