అయ్యో దేవుడా.. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. దంపతులతోపాటు..

పాపం.. పవిత్ర స్నానం చేసి ఇంటికి బయలుదేరిన తెలంగాణ వాసులను రోడ్డుప్రమాదం బలి తీసుకుంది. యూపీలోని ప్రయాగ్‎రాజ్‎లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి తిరిగి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయ్యో దేవుడా.. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. దంపతులతోపాటు..
Crime News

Edited By:

Updated on: Feb 24, 2025 | 9:40 PM

పాపం.. పవిత్ర స్నానం చేసి ఇంటికి బయలుదేరిన తెలంగాణ వాసులను రోడ్డుప్రమాదం బలి తీసుకుంది. యూపీలోని ప్రయాగ్‎రాజ్‎లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి తిరిగి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాగ్ రాజ్‎కు 60కిలోమీటర్ల దూరంలోని మీర్జా పూర్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి‌కి చెందిన వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40)… వారి కారు డ్రైవర్ మల్లారెడ్డి (42) మృతి చెందారు.

మహా కుంభ్‎లో పుణ్య స్నానాలు అనంతరం తిరిగి వస్తుండగా.. మీర్జాపూర్ వద్ద వీరు ప్రయాణిస్తోన్న కారు బైక్‌ను తప్పించే క్రమంలో టిప్పర్‎ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కారు డ్రైవర్ ఘటనాస్థలిలోనే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

వెంకటరామిరెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‎గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వస్థలం న్యాల్‌కల్ మండలం మామిడిగి కాగా.. సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విచారం వ్యక్తంచేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతదేహాలను స్వస్థలానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..