KTR: కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

|

Jan 16, 2024 | 7:52 PM

లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణలో పొలిటికల్‌ యాక్టివిటీ మళ్లీ పదునెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ గేరు మార్చింది. మొన్నటి దాక పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీ సమీక్షలు. ఇప్పుడు జిల్లాల బాట పట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. స్థానిక బీఆర్‌ ఎస్‌ నేతలు,కార్యకర్తలను కలిశారు.

KTR: కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..
KCR KTR
Follow us on

లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణలో పొలిటికల్‌ యాక్టివిటీ మళ్లీ పదునెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ గేరు మార్చింది. మొన్నటి దాక పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీ సమీక్షలు. ఇప్పుడు జిల్లాల బాట పట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. స్థానిక బీఆర్‌ ఎస్‌ నేతలు,కార్యకర్తలను కలిశారు. సిరిసిల్లలో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవులు వస్తాయి, పోతాయి, పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి మన రాష్ట్రానికి 82 అవార్డులు వచ్చాయనీ.. రాష్ట్రానికి 82 అవార్డులు వచ్చినందుకు గర్వపడుతున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ గా రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానన్నారు. పెండింగ్ బిల్లుల సమస్యపై సర్పంచ్‌ల తరుపున ప్రభుత్వంతో మాట్లాడడానికి తాము సిద్దంగా ఉన్నామనిని ధీమాను ఇచ్చారు కేటీఆర్‌.. పవర్‌లూమ్‌ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్‌ సర్కార్‌ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు.

తెలంగాణ దళం.. తెలంగాణ గళం.. బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ప్రజల పక్షమేనన్నారు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. ఇటీవల నాగర్‌ కర్నూల్‌ జిల్లా గంట్రావుపల్లిలో మాజీ జవాన్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేష్‌ హత్యను తీవ్రంగా ఖండించారు కేటీఆర్‌. అంతేకాదు గత ఆదివారం మల్లేష్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ సీనియర్‌నేత మల్లు రవి. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను..రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఆరోపించారు. కాగా.. మల్లేష్‌ హత్య ఘటనపై బీఆర్‌ఎస్‌ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మొన్న నాగర్‌ కర్నూల్ జిల్లా.. తాజాగా సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటనతో క్షేత్ర స్తాయిలో కార్యకర్తలకు భరోసాను ఇస్తూ.. లోకసభ ఎన్నికలకు క్యాడర్‌ను సంసిద్దం చేసేలా బీఆర్ఆర్ ప్రణాళికలకు పదనుపెడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..