KTR US Tour:పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. ఘనస్వాగతం పలికిన ప్రవాసీలు

|

Mar 20, 2022 | 5:30 PM

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఘనస్వాగతం లభించింది.

KTR US Tour:పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. ఘనస్వాగతం పలికిన ప్రవాసీలు
Ktr Us Tour
Follow us on

Minister KTR America Tour: తెలంగాణ(Telangana) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు(KT Rama Rao) ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికా(America)లోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, కార్యకర్తలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కేటీఆర్‌కు పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రతినిధుల బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.

మంత్రి కేటీఆర్ లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్.. ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు.

Read Also….  BJLP Meeting: మార్చి 24న యూపీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. ఎల్పీనేతగా యోగి.. పరిశీలకులుగా అమిత్ షా!