Komatireddy Venkatreddy: రేవంత్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్.. ప్రత్యేక వినతి..!

|

Aug 13, 2021 | 5:02 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాఫిక్‌గా మారారు.

Komatireddy Venkatreddy: రేవంత్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్.. ప్రత్యేక వినతి..!
Revanth Reddy, Komatireddy Venkatreddy
Follow us on

Komatireddy Phone Call to Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాఫిక్‌గా మారారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత దండోరా సభను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఏకంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేసిన మరీ చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇటీవల ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత దండోరా సభ విజయవంతం కావడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ మరో సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఈ సభకు తానూ హాజరు కాలేకపోతున్నానని, తన నియోజకవర్గంలో జరగాల్సిన గిరిజన, దళిత దండోరాను వాయిదా వేయాలని టీపీసీసీని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ నెల 18 న పార్లమెంటరీ స్టడీ టూర్‌కు వెళ్లాల్సి ‘ఉన్నందున సభకు హాజరు కాలేకపోతానని రేవంత్ కి తెలిపిన కోమటిరెడ్డి సభను మరోసారి నిర్వహించుకుందామన్నారు. అయితే, ఈ సభను వాయిదా వేస్తారా? కొనసాగిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.


రేవంత్ రెడ్డి టీపీపీసీ చీఫ్‌గా ఎంపికైన తరువాత కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. అడుగంటిన పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అశించారు. ఆ దిశగా రేవంత్ కూడా తనవంతు కృషి చేస్తున్నారు. అయితే, పీసీసీ చీఫ్ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కొంతమంది నేతలు మాత్రం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధం అంటూనే.. ఆ దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ఇదే క్రమంలో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య అప్పుడప్పుడు మాటలు కలుస్తున్నా.. ఇద్దరూ కలిసి ముందుకు సాగడం లేదు. ఇటీవల ఇంద్రవెల్లిలో జరిగిన గిరిజన దళిత దండోరా సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఇక ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో గిరిజన దళిత దండోరా సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సభా ప్రాంగణాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిర్వహించాలని టీపీసీసీ భావించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే, అసలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాకుండా మహేశ్వరం నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో సభ నిర్వహిస్తే.. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. అలా జరగకపోతే లేనిపోని కొత్త ఊహాగానాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి బదులుగా పక్కనే ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో సభను పెడితే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం.

Read Also…  BJP MLA Raja Singh: రెండు వేల కోట్లు ఇస్తే పదవికి రాజీనామా చేసేస్తా: ఎమ్మెల్యే రాజాసింగ్

YS Viveka: కేసును వదిలేయాలంటూ బెదిరింపులు.. భద్రత కల్పించాలంటూ కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు సునీతా లేఖ