Telangana News: అంగన్ వాడీ కేంద్రంలో తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్న జిల్లా కలెక్టర్.. సర్వత్రా ప్రశంసల వర్షం..

| Edited By: Ravi Kiran

Nov 20, 2021 | 6:44 PM

Telangana News: ప్రజల కోసం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు,   ప్రజలకు సేవ చేయడానికి ఉన్నత పదవులను చేపట్టిన అధికారులు.. చేసే పనులు ఉన్నతంగా..

Telangana News: అంగన్ వాడీ కేంద్రంలో తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్న జిల్లా కలెక్టర్.. సర్వత్రా ప్రశంసల వర్షం..
Collector Rahul Raj
Follow us on

Telangana News: ప్రజల కోసం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు,   ప్రజలకు సేవ చేయడానికి ఉన్నత పదవులను చేపట్టిన అధికారులు.. చేసే పనులు ఉన్నతంగా ఉండాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ విధులను నిర్వహించాలి. ఇక ఏ ప్రజలకు సేవచేయడానికి అధికారం చేపట్టారో.. ఆ ప్రజలు తమను నమ్మి..తమను  అనుసరించే విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం, ప్రభుత్వ పాఠశాల్లో తమ పిల్లలను చదివించడం వంటి పనులు చేస్తే.. వారిని సామాన్యులు అనుసరించే అవకాశం ఎక్కువ. అందుకనే ఇటీవల తెలంగాణకు చెందిన కలెక్టరు, కలెక్టరు భార్య ప్రభుత్వాస్పత్రిలో చేరి.. బిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ప్రయివేట్ వాటికంటే ఏ విధంగా తక్కువ కాదంటూ చెప్పకనే తమ తీరుతో చెప్పేశారు. అయితే తాజాగా మరో జిల్లా కలెక్టర్ తన ఇద్దరు కూతుర్లను అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కుమురం భీం జిల్లా కలెక్టరు రాహుల్‌రాజ్‌ కు ఇద్దరు కుమార్తెలు. అయితే ప్రస్తుత సమాజంలో సామాన్యులు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్స్ లో చదివించాలని భావిస్తున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించకపోయినా అప్పైనా చేస్తామనే రీతిలో తల్లిదండ్రుల ఆలోచనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరు రాహుల్‌రాజ్‌  తన ఇద్దరు  కుమార్తెలు నిర్వికరాజ్‌, రిత్వికరాజ్‌లను అంగన్‌వాడీ  కేంద్రానికి పంపిస్తున్నారు.  ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్‌-1 కేంద్రంలోని తమ తోటి పిల్లల్తో ఆడుతూపాడుతూ చిన్న చిన్న పదాలను వల్లే వేస్తూ.. సంతోషంగా గడుపుతున్నారు.   ఇదే విషయంపై  అంగన్ వాడీ టీచర్ అరుణ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా కలెక్టర్ పిల్లలు అంగన్ వాదీ కేంద్రానికి వస్తున్నారని.. ఇక్కడ పెట్టె భోజనమే తింటున్నారు చెప్పారు.  ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టరు రాహుల్‌రాజ్‌ పై నెటిజన్లు మీరు పలువురికి స్ఫూర్తి అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..