CM KCR AND VIJAY: కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy), తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విజయ్‌ను సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెబుతున్నా వీరిద్దరూ కలిసి సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎందుకంటే తమిళనాట విజయ్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌తోనే పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ తరహాలోనే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడీ కోలీవుడ్ స్టార్. అప్పుడప్పుడు విజయ్ వ్యవహరిస్తోన్న తీరు కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ఇటీవల తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ గుడ్‌విలే సింబల్‌గా పోటీచేసిన అభిమానులు 128 పంచాయతీల్లో గెలుపొందడం గమనార్హం. ఈక్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో విజయ్ కీలకం అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్నిరకాల అంశాల నేపథ్యంలో కేసీఆర్‌తో విజయ్ భేటీపై అనేక చర్చలు మొదలయ్యాయి. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రయత్నంలో భాగమా అనే ఆసక్తికర చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: