Watch Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన KLR ఇంజనీరింగ్‌ విద్యార్ధులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అడవిలో ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు విద్యార్థులు బస్సు కింద పడి నలిగిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను బయటకు తీస్తున్న..

Watch Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన KLR ఇంజనీరింగ్‌ విద్యార్ధులు
KLM Engineering College bus overturned

Edited By:

Updated on: Jan 02, 2026 | 12:43 PM

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్ధులతో వెళ్తున్న KLR ఇంజినీరింగ్ కాలేజీ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఒక్కసారిగా బోల్తా పడటంతో ఈప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్దులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు బస్సు కింద నలిగి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే విద్యార్ధులను బయటకు తీసేందుకు పరుగులు తీశారు. మణుగూరు నుండి పాల్వంచ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధులను కాపాడేందుకు యత్నిస్తున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన ఓ విద్యార్థిని కోసం పోలీసులు JCB తెప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.