Kishan Reddy: కావాలనే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది.. రాష్ట్రపతి ముర్ము, స్పీకర్ ఓం బిర్లాకు కిషన్ రెడ్డి లేఖ..

Kishan Reddy Letter: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పీడు పెంచారు. బాధ్యతలు చేపట్టిన నాటినుంచే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, మొదటిసారి బాట సింగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Kishan Reddy: కావాలనే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది.. రాష్ట్రపతి ముర్ము, స్పీకర్ ఓం బిర్లాకు కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy Mallikarjun Kharge

Updated on: Aug 01, 2023 | 4:22 PM

Kishan Reddy Letter: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పీడు పెంచారు. బాధ్యతలు చేపట్టిన నాటినుంచే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, మొదటిసారి బాట సింగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ జులై 20న చేపట్టిన ఛలో బాట సింగారం కార్యక్రమం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆరోజు ఉదయం నుంచే పోలీసులు చాలాచోట్ల బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, పలువురు బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి బాటసింగారం వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. అంతేకాకుండా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తానొక కేంద్రమంత్రినని.. ఇళ్ల పరిశీలనకు వెళ్తుంటే తనను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం సైతం జరిగింది.

అయితే, ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సమీక్షించేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాటసింగారం బయలుదేరి వెళుతుండగా శంషాబాద్‌లో పోలీసులు అడ్డుకున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన విధులకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us