Khammam Politics: ఖమ్మం వేదికగా జూలై 2న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలోకి చేరనున్నారు. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొనే సభ జరగడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉన్న తరుణంలో ఖమ్మంలో రాజకీయ సెగలు మొదలయ్యాయి. స్థానిక లీడర్లు అయిన పొంగులేటి-మంత్రి అజయ్ వర్గాల మధ్య వాతావారణం హీటెక్కుతోంది. ఒకరిపై మరొకరు ‘సై అంటే సైసై’ అంటున్నారు. అక్కడితో ఆగక లేఖాస్త్రాలు, పోస్టర్లతో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
ఇదిలా కొనసాగుతుండగానే పొంగులేటి అనుచరులైన డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, చీకటి కార్తిక్‌లకు మంత్రి అజయ్ వర్గం వార్నింగ్ ఇచ్చారు. ‘మంత్రిపై చిల్లర కామెంట్లు చేసినవాళ్లు క్షమాపణ చెప్పాలని, కాళ్లపై పడి క్షమాపణలు చెప్పాలని లేదంటే శవాలు కూడా దొరకవంటూ’ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, తన ఆనుచరులకు వస్తున్న వార్నింగ్‌లపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘నా అనుచరులను చంపుతామని బెదిరిస్తున్నారు. వార్నింగులకు భయపడేది లేదు. వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారు’ అని పొంగులేటి పేర్కొన్నారు. ఇక రేపు ఖమ్మం వేదికగా జరగబోయే కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పొంగులేటి శ్రీనివాసరావు, జూపల్లి కృష్ణారావు, వారివారి అనుచరులు అంతా.. రాహుల్ సమక్షంలో ఖమ్మం ప్రజల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..