ఖమ్మం జిల్లాలో పోలీసలు తనిఖీలు.. అనుమానంతో ఓ వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకుని చెక్ చేయగా..

గంజాయి, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ.. కొందరు కేటుగాళ్లు అధికారుల కళ్లు కప్పి అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాగే ఖమ్మం జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న సుమారు 324 కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ గంజాయిని నిందితులు ఎలా దాచి తీసుకెళ్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఖమ్మం జిల్లాలో పోలీసలు తనిఖీలు.. అనుమానంతో ఓ వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకుని చెక్ చేయగా..
Khammam Ganja Seizure
Image Credit source: File photo

Updated on: Aug 05, 2026 | 12:37 PM

ఖమ్మం జిల్లాలో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా నగరంలోకి గంజాయి రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో జీళ్లచెరువు వద్ద కూసుమంచి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ వాహనంపై అనుమానం రావడంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని పక్కకు తీసి లోతుగా తనిఖీలు చేయగా.. కారులోని సీట్ల కింద గంజాయిని అక్రమంగా దాచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి మొత్తం 324 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సదరు నిందితులకు రాజమండ్రి, బెంగళూరులతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని గంజాయి స్మగ్లర్లు, వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.

వీరంతా ఒక ముఠాగా ఏర్పడి.. అక్కడి నుంచి గంజాయిని అక్రమంగా వాహనాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు తరలించి, ఇక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూపీ లాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us