Telangana Crime News: లిఫ్ట్‌ అడిగి ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసిన దుండగుడు.. ఆ తర్వాత బైక్‌తో పరార్‌!

రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కొందరు చేతులెత్తి లిఫ్ట్‌ ప్లీజ్‌! అని అడుగుతుంటారు. మీరు వెళ్లే దారిలోనే దిగాలంటూ బైకుపైనో, కారులోనో కూర్చుంటారు. ఇలా అమాయకంగా లిఫ్టు అడిగి ఓ యువకుడి ప్రాణాలు తీశాడో గుర్తు తెలియని వ్యక్తి..

Telangana Crime News: లిఫ్ట్‌ అడిగి ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసిన దుండగుడు.. ఆ తర్వాత బైక్‌తో పరార్‌!
Khammam Crime

Edited By: Ram Naramaneni

Updated on: Sep 19, 2022 | 2:53 PM

Khammam Crime News: రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కొందరు చేతులెత్తి లిఫ్ట్‌ ప్లీజ్‌! అని అడుగుతుంటారు. మీరు వెళ్లే దారిలోనే దిగాలంటూ బైకుపైనో, కారులోనో కూర్చుంటారు. ఇలా అమాయకంగా లిఫ్టు అడిగి ఓ యువకుడి ప్రాణాలు తీశాడో గుర్తు తెలియని వ్యక్తి. ఖమ్మం జిల్లాకు చెందిన ముదిగొండ మండలంలోని బాణాపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..

పని మీద బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఆపాడు. అనంతరం అర్జెంట్‌ పని మీద వెళ్తున్నట్లు లిఫ్ట్‌ ఇయ్యవల్సిందిగా కోరాడు. వెళ్లే దారిలోనే కదా అని అతన్ని కూడా బైకుపై ఎక్కించుకుని కొంత దూరం వెళ్లారు. ఐతే మార్గం మధ్యలో బైకు నడుపుతున్న వ్యక్తికి సదరు దుండగుడు ఇంజెక్షన్‌ ఇచ్చాడు. దీంతో వెంటనే వాహనదారుడు స్పృహ తప్పి, అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అతన్ని రోడ్డు పక్కన వదిలేసి, బైక్‌తో పరారయ్యాడు దుండగుడు. మృతుడు చింతకాని మండలానికి చెందిన వాడిగా స్థానికులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి