KCR: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు.. మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్‌లోకి నాయకులు తిరిగి వస్తారు.. పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని.. చేప పిల్లల పంపిణీ, ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్ తీసేశారు.. అంటూ ఫైర్ అయ్యారు.

KCR: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Kcr
Follow us

|

Updated on: Jul 04, 2024 | 9:46 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు.. మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్‌లోకి నాయకులు తిరిగి వస్తారు.. పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని.. చేప పిల్లల పంపిణీ, ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్ తీసేశారు.. అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసీఆర్.. ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై.. అప్పడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పై తిరుబాటు కచ్చితంగా వస్తుందని నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో అన్నారు.

నేతలతో బుధవారం భేటీ అయిన కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కేసీఆర్ గారు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితిలనైనా అధిగమిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. కాంగ్రేసు పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేసినామని నాలుక్కరుసుకుంటున్నారన్నారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏండ్ల కాంగ్రేస్ వైఖరి అనీ, ఈ నేపథ్యంలో ప్రజలు అనతికాలంలోనీ కాంగ్రేస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని కేసీఆర్ వివరించారు. “మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని” కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ, అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.