KTR: జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానమిది: కేటీఆర్

|

Oct 25, 2021 | 6:37 PM

తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల మైలు రాయిని చేరుకున్న వేళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంఠంలో కవిత్వం పొంగిపొర్లింది. జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా..

KTR: జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానమిది: కేటీఆర్
Trs Ktr
Follow us on

KTR – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల మైలు రాయిని చేరుకున్న వేళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంఠంలో కవిత్వం పొంగిపొర్లింది. జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానంగా టీఆర్ఎస్ పార్టీ విజయాల్ని గుర్తుచేసుకున్నారు కేటీఆర్. ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏండ్ల పండుగ ఇదంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

స్వరాష్ట్రం కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి ప‌థం వైపు న‌డిపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా టీఆర్ఎస్ పార్టీ నిలిపింద‌ని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విద‌శాబ్ది వేడుక‌ల సంద‌ర్భంగా రెండు క‌విత‌ల‌ను కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గ‌ళం.. బ‌లం.. అగ్రగామి ద‌ళం.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ వెల్లడించారు.

Read also: Pawan Kalyan: ఈ నెల 31న విశాఖకు పవన్ కళ్యాణ్.. పూర్తి వివరాలు