DK LETTER FIGHT ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే పేరుతో లేఖ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో లేఖ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆ లేఖను చూపిస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. KCR మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై డీకే శివకుమార్ అసలు విషయాన్ని బయటపెట్టారు.

కర్ణాటక తో కరెంట్ పంచాయితీ అలా ఆగిందే లేదో.. డీకే శివకుమార్ పేరుతో లేఖ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. KCR మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై డీకే శివకుమార్ అసలు విషయాన్ని బయటపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో లేఖ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆ లేఖను చూపిస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
ఇప్పటికే కరెంట్ విషయంలో బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అవసరమైతే కర్ణాటకకు బస్సులో తీసుకెళ్తామన్న కాంగ్రెస్ నేతల సవాళ్లు, బీఆర్ఎస్ నేతల కౌంటర్లతో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. ఆ వేడి కాస్త చల్లారిందనుకునేలోపే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరుతో లేఖ రాజకీయ రచ్చకు కారణమైంది.
డీకే శివకుమార్ పేరుతో హల్‌చల్ చేస్తోన్న లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకకు తరలించాలని డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు కేటీఆర్. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కూడా డీకే శివకుమార్ ఆ లేఖలో స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఫాక్స్‌కాన్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అసలు ఆ లేఖ తాను రాయలేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశానన్నారు డీకే శివకుమార్. లేఖపై ఆయన ఇచ్చిన వివరణతో ఈ వివాదం ఇక్కడితో ముగిస్తుందా..? మరో టర్న్ తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి..!
ಆಪಲ್ ಏರ್ ಪಾಡ್ ಉತ್ಪಾದನಾ ಘಟಕವನ್ನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ಥಳಾಂತರಗೊಳಿಸುವಂತೆ ಫಾಕ್ಸ್ ಕಾನ್ ಸಂಸ್ಥೆ ನಾನು ಬರೆದಿರುವುದಾಗಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿರುವ ಪತ್ರ ನಕಲಿಯಾಗಿದ್ದು, ಈ ಸಂಬಂಧ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಾಗಿದೆ.
The letter circulating on social media, saying… pic.twitter.com/HZTcTM5f96
— DK Shivakumar (@DKShivakumar) November 4, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..