
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన మొగిలిచెర్ల కిషోర్ తాజాగా ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన కిషోర్ చిన్నప్పటి నుంచే విద్య పట్ల ఆసక్తి చూపుతూ, ప్రభుత్వ ఉద్యోగం సాధించే లక్ష్యంగా కష్టపడ్డాడు. 2017లో పోలీస్ శాఖలో TSSP కానిస్టేబుల్‌గా, 2019లో పంచాయతీ కార్యదర్శిగా, 2020, 2024లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సంపాదించాడు. తాజాగా విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపిక కావడం ద్వారా తన పట్టుదల, కృషిని చాటాడు.
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా అరుదు. ఆ ఫీట్ సాధించిన కిషోర్ యువత.. విజయతీరాలకు చేరాలంటే సాధన, కృషి ఎంత ముఖ్యమో చూపించాడు. గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు ఆయనను అభినందిస్తున్నారు. సరిగ్గా ప్లాన్ చేసి కష్టపడి చదివితే విజయం సాధించవచ్చని కిషోర్ సూచిస్తున్నాడు. ఇతని లైఫ్ స్టోరీ.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రేరణగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.