రెవిన్యూ శాఖలో కలకలం.. ముగ్గురు తహశీల్దార్ల అక్రమాలుపై వేటు..

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యూటేషన్ విషయంలో గజ్వేల్ తహసీల్దార్ శ్రీనివాస్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. మరోవైపున వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అమెరికాలో నివసిస్తున్న వారి పట్టాదారుతో సంబంధం లేకుండానే భూ విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో ధరణిలో పేరు మార్పిడి చేశారు. దీంతో ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను తొందరపడి ఇలా చేశానన్నారు తిరుమల్ రావు.

రెవిన్యూ శాఖలో కలకలం.. ముగ్గురు తహశీల్దార్ల అక్రమాలుపై వేటు..
Karimnagar Collector

Edited By: Srikar T

Updated on: Mar 14, 2024 | 12:20 PM

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యూటేషన్ విషయంలో గజ్వేల్ తహసీల్దార్ శ్రీనివాస్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. మరోవైపున వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అమెరికాలో నివసిస్తున్న వారి పట్టాదారుతో సంబంధం లేకుండానే భూ విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో ధరణిలో పేరు మార్పిడి చేశారు. దీంతో ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను తొందరపడి ఇలా చేశానన్నారు తిరుమల్ రావు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అంతకు ముందే వీణవంకలో ఓ గ్రామానికి చెందిన ఫ్యామిలీకి మెంబర్టిఫికెట్ ఇచ్చిన సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

ఇక్కడ పనిచేస్తున్న ధరణీ ఆపరేటర్ పై కూడా అధికారులు అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నారు. వీణవకం తహసీల్దార్ తో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రెవెన్యూ సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. తాజాగా జమ్మికుంట తహసీల్దార్ రజినిపై ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు జరిగాయి. ఉదయాన్నే కెఎల్ఎన్ రెడ్డి కాలనీకి చేరుకున్న ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు తహసీల్దార్లపై వేటు పడడంతో కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాల రెవెన్యూ అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది. ఈ వరుస ఘటనలతో కరీంనగర్ జిల్లా పరిధిలో అసలేం జరుగుతోంది అన్న చర్చ కూడా మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..