Telangana: గురుకుల పాఠశాలలో విద్యార్థినులను కొరికిన ఎలుకలు.. పట్టించుకోని అధికార యంత్రాంగం!

|

Aug 30, 2023 | 8:15 AM

మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు కోటి ఆశలతో తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివిస్తోంటో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. తాజాగా ఓ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు..

Telangana: గురుకుల పాఠశాలలో విద్యార్థినులను కొరికిన ఎలుకలు.. పట్టించుకోని అధికార యంత్రాంగం!
Rats Bites Gurukul School Students
Follow us on

కామారెడ్డి, ఆగస్టు 30: మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు కోటి ఆశలతో తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివిస్తోంటో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. తాజాగా ఓ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు రాత్రి వసతి గదుల్లో నిద్రిస్తుండగా ఎలుకలు కొరకడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా దోమకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం రాత్రి (ఆగస్టు 28) పలువురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. దీంతో బాలికలకు చిన్నపాటి గాయాలయ్యాయి. గాయపడిన బాలికలను మంగళవారం దోమకొండ సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి ఇంజక్షన్లు వేశారు.

తమ గురుకుల పాఠశాలలో రాత్రిపూట ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయని, నిద్రిస్తున్న సమయంలో కాళ్లు, చేతులను కొరుకుతున్నాయని పలువురు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుకల బెడద తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా రాష్ట్రలోని పలు గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. సరైన నీటి సదుపాయాలులేక, అరకొర వసతులతో విద్యార్ధులు పాట్లు పడుతున్నారు. మరుగుదొడ్లు, వసతి గృహాలు, తరగతి గదులు అద్వాన్నంగా ఉంటున్నాయి. ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలల పరిస్థితి మెరుగుపరచవల్సిందిగా విద్యార్ధుల తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.