Kaloji University: ఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ యూనివర్సిటీ..

|

Jan 29, 2021 | 9:09 PM

Kaloji University: వైద్య విద్యార్థుల తరగుల నిర్వహణకు సంబంధించిన కాలోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ కీలక

Kaloji University: ఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ యూనివర్సిటీ..
Follow us on

Kaloji University: వైద్య విద్యార్థుల తరగతుల నిర్వాహణకు సంబంధించి కాలోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా మూసివేయబడిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు వచ్చే నెల 1 నుంచి తెరుచుకోనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వుల్లో యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కళాశాలలను ప్రారంభిస్తామని వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 21న అన్ని కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే అకాడమిక్ ఇయర్ పూర్తి కావొస్తుండటం.. పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో కాలేజీలను తెరవాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1 నుంచి మెడికల్ కాలేజీలను తెరిచేందుకు సిద్ధమైనట్లు వీసీ తెలిపారు.

Also read:

Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం…

Ocean cleanup yacht: ఈ యాచ్ సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది.. అదే వ్యర్థాలను ఇంధనంగా మారుస్తుంది