Kaloji Health University: రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారులు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ అనంతరం మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థుల పేర్లను యూనివర్సిటీ విడుదల చేస్తుంది. ఆ తరువాత ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం సీట్ల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. కాగా, సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in సైట్‌లో చూడవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
Also read:
నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి
కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే