చలించిన న్యాయమూర్తి.. ఏకంగా వృద్ధ దంపతలు వద్దకు నడిచి వచ్చిన మేజిస్ట్రేట్..!

ఇది ఒక అనూహ్య ఘటన. ఓవృద్ద దంపతుల పరిస్థితి చూసి నిజామాబాద్ జిల్లా బోధన్ న్యాయమూర్తి చలించి పోయారు. ఏకంగా వారి వద్దకే వచ్చి కేసు వివరాలు, వారి పరిస్థితులు గమనించి కేసు విచారణ చేపట్టారు. అనూహ్య ఘటన బోధన్ కోర్టులో సోమవారం(ఏప్రిల్ 27) చోటుచేసుకుంది. రుద్రూర్ మండలం రాయకుర్‌కు చెందిన వృద్ధ దంపతులు సాయమ్మ, గంగారాంలపై కోడలు గతంలో వరకట్నం కేసు నమోదు చేయించింది.

చలించిన న్యాయమూర్తి.. ఏకంగా వృద్ధ దంపతలు వద్దకు నడిచి వచ్చిన మేజిస్ట్రేట్..!
Jfcm Judge Sai Shiva

Edited By:

Updated on: Apr 29, 2025 | 5:52 PM

ఇది ఒక అనూహ్య ఘటన. ఓవృద్ద దంపతుల పరిస్థితి చూసి నిజామాబాద్ జిల్లా బోధన్ న్యాయమూర్తి చలించి పోయారు. ఏకంగా వారి వద్దకే వచ్చి కేసు వివరాలు, వారి పరిస్థితులు గమనించి కేసు విచారణ చేపట్టారు. అనూహ్య ఘటన బోధన్ కోర్టులో సోమవారం(ఏప్రిల్ 27) చోటుచేసుకుంది. రుద్రూర్ మండలం రాయకుర్‌కు చెందిన వృద్ధ దంపతులు సాయమ్మ, గంగారాంలపై కోడలు గతంలో వరకట్నం కేసు నమోదు చేయించింది. ఈ విషయంలో సదరు దంపతులు ఇద్దరూ బోధన్ కోర్టుకు వచ్చారు.

వృద్ద దంపతులు నడవలేని స్థితిలో ఉండడంతో పాటు ఆటోలో కోర్టు హాలు వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి సాయి శివ వృద్ధ దంపతుల ధీన పరిస్థితికి చలించిన న్యాయమూర్తి బెంచ్ నుండి బయటకు వచ్చారు. న్యాయమూర్తి స్వయంగా దంపతుల వద్దకు చేరుకుని వారిపై ఉన్న కేసు వివరాలపై విచారణ చేపట్టారు. చివరికి పరిస్థితి తెలుసుకుని కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వృద్ధ దంపతుల పట్ల ఆ న్యాయమూర్తి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు . దీంతో పలువురు ప్రశంసలతో న్యాయమూర్తిని అభినందించారు. ఇలాంటి న్యాయమూర్తితో ఎంతో మందికి న్యాయం జరుగుతుందని పలువురు చర్చించుకున్నారు. కాగా, ఈ హఠాత్ పరిణామంతో సదరు దంపతుల కళ్లల్లో పట్టలేని ఆనందం కనిపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..