బదిలీ వేటుకు ఎస్సై బేఖాతరు.. హెడ్ కానిస్టేబుల్‎పై కన్నేసి.. చివరకు..

ఓ ఎస్ఐ యవ్వారం హాట్ టాపిక్‎గా మారింది. గతంలో లైంగిక వేధింపులపై శిక్ష ఎదుర్కొన్నా తీరు మారలేదు. తాజాగా మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణల నేపథ్యంలో అరెస్టయ్యాడు. ఆయనను కస్టడీకి తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎస్సై.? ఎవరిపై లైంక వేధింపులకు పాల్పడ్డాడు.? ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? ఇప్పుడు చదివేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా నిలుస్తున్నారు.

బదిలీ వేటుకు ఎస్సై బేఖాతరు.. హెడ్ కానిస్టేబుల్‎పై కన్నేసి.. చివరకు..
Si Bhavani Sen Suspend

Edited By: Srikar T

Updated on: Jun 19, 2024 | 3:18 PM

ఓ ఎస్ఐ యవ్వారం హాట్ టాపిక్‎గా మారింది. గతంలో లైంగిక వేధింపులపై శిక్ష ఎదుర్కొన్నా తీరు మారలేదు. తాజాగా మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణల నేపథ్యంలో అరెస్టయ్యాడు. ఆయనను కస్టడీకి తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎస్సై.? ఎవరిపై లైంక వేధింపులకు పాల్పడ్డాడు.? ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? ఇప్పుడు చదివేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా నిలుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ASP భుజంగరావు జైలుపాలు అవ్వగా.. కొద్దిరోజుల క్రితం చిట్యాల పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ బర్త్ డే వేడుకలు జరిపిన ఎస్సై బదిలీ అయ్యాడు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లోనే మహాదేవాపూర్ ఎస్సైపై మరో వివాదం వెలుగులోకి రావడంతో బదిలీ వేటు పడింది.

తాజాగా కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్‎పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు కస్టడికి తీసుకున్నారు. ఎస్సై భవాని సేన్‎ వేధింపుల పాల్పడి అరెస్టయ్యాడు. మరోసారి అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రమ అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ నేపథ్యంలో ఎస్సై భవాని సేన్‎పై అదే కాళేశ్వరం PSలో కేసు నమోదు చేశారు పోలీసులు. సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.

ఎస్సై భవానీ సేన్‎పై బాధిత మహిళ హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‎లోనే ఇద్దరు డీఎస్పీలు, సీఐలు విచారణ చేపట్టారు. లైంగిక వేదింపులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఐతే ఈ ఎస్సై కామ క్రీడలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే తరహా లైంగిక ఆరోపణలు ఎదుర్కొనడంతో బదిలీ వేటు పడింది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు బదిలీ వేటువేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన సీఐపై సస్పెండ్ వేటు వేసిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు. ఈ ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమైతే ఆయనను జైలుకు పంపే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..