Jangaon ZP Chairman Pagala Sampath Reddy: ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువకుల నుంచి పెద్దవారి వరకు చాలామంది మరణిస్తున్నారు. తాజాగా.. జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
పాగాల సంపత్ రెడ్డి సోమవారం సాయంత్రం వేళ గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.
కాగా సంపత్ రెడ్డి జనగామ నుంచి బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కృషి చేశారు. సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..