Jagadish Reddy: మీటర్లు పెట్టనందుకే వేధిస్తున్నారు.. బీజేపీ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..

Jagadish Reddy on Kishan Reddy: సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నాటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ (TRS Vs BJP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా.. ఈ కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Jagadish Reddy: మీటర్లు పెట్టనందుకే వేధిస్తున్నారు.. బీజేపీ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..
Jagadish Reddy

Updated on: Feb 15, 2022 | 4:17 PM

Jagadish Reddy on Kishan Reddy: సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నాటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ (TRS Vs BJP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా.. ఈ కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్ ఫలితాల నుంచి సీఎం కేసీఆర్‌ తీరులో మార్పు వచ్చిందని.. తెలంగాణ సమాజం కేసీఆర్ ముందు బానిసల్లా ఉండాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మాటలు తీసుకున్న అంశాలు దిగజారుడు – దివాలాకోరు విధంగా ఉన్నాయంటూ మండి పడ్డారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యాక తెలంగాణ ఒక్క రూపాయైన తెచ్చారా..? అంటూ ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు అయిదు పైసలు కూడా ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా పై ఇప్పటికి ఉలుకు పలుకు లేదంటూ విమర్శించారు. బండి సంజయ్ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ఎంపీగా ఉన్నారని.. ఆయన కూడా నిధులు తీసుకురాలేదని పేర్కొన్నారు.

తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదా ఉందని.. కేసీఆర్ మాట్లాడింది నిజమని పేర్కొన్నారు. కేంద్ర సవరణ బిల్లు తప్పా అంటూ నిలదీశారు. ఇది తప్పైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది అని భయపడి 2021 ఏప్రిల్లో దొడ్డి దారిన విద్యుత్ ముసాయిదా బిల్లు తెచ్చారని జగదీశ్ రెడ్డి విమర్వించారు. మొత్తం మీటర్లు పెడితే, ప్రైవేటైజేషన్ చేస్తే 25 మార్కులు అని ఇందులో ఉందని వెల్లడించారు. మీటర్లు పెట్టనందుకే మమ్మల్ని వేధిస్తున్నారన్నారు. వీటిపై బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని లేదంటే మాట్లాడకుండా కూర్చోవాలంటూ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నారని.. ఇవన్నీ మాట్లాడటానికి కిషన్ రెడ్డికి సిగ్గు అనిపించటం లేదా అని పేర్కొన్నారు. మా భాషపై మాట్లాడుతున్నారు.. మీ జాతీయ నాయకులు మాట్లాడేది ఏ భాష అంటూ పేర్కొన్నారు.

Also Read: Bjp vs Trs: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. సవాల్‌కు సిద్ధమంటూ.. లైవ్ వీడియో

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి.. హ్యాపీ టైమ్స్ అంటూ టీపీసీసీ ట్వీట్‌..