Pailla Shekar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు.. చెల్లింపుల అవకతవకలపై అధికారుల ఆరా
IT Raids: భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుపుతోంది. అలాగే శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. దాదాపు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే నివాసాలు..
హైదారబాద్, జూన్ 14: భువనగిరి MLA పైళ్ల శేఖర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో సహా పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. 12 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే శేఖర్ రెడ్డి సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు.ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి భార్య వనితా హిల్ ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్తపేట, గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కార్యాలయాలతో పాటు భువనగిరిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. హైదరాబాద్‌తో పాటు కర్నాటకలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికాలోనూ తీర్థ గ్రూప్ మైనింగ్ వ్యాపారం చేస్తోంది. దీంతో ఐటీ అధికారులు ఐటీ చెల్లింపుల అవకతవకలపై ఆరా తీస్తున్నారు.
శేఖర్ రెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఈ తనిఖీలతో టెన్షన్ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం