150 కోట్ల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. హీరో ఎవరంటే?

16 December 2024

Basha Shek

టాలీవుడ యంగ్ సెన్సేషన్ శ్రీలీల మళ్లీ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ఓకే చెబుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారం తర్వాత కాస్త సైలెంట్ అయిన ఈ బ్యూటీ పుష్ప 2లో మెరిసింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కిస్సిక్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ, నాగచైతన్య, అఖిల్ ల సినిమాలు ఉన్నాయి.

తాజాగా ఈ డ్యాన్సింగ్ క్వీన్ కు మరో భారీ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఇది ఆమె తొలి తమిళ సినిమా.

ఆకాశమే హద్దురా మూవీ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో అమరన్ హీరో శివకార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నాడు

 సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా ఎంపికైంది.

ఈ మూవీలో జయం రవి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక జీవీ ప్రకాశ్ కుమార్ కు ఇది వందో సినిమా.