నీలి నింగిలో విహరించే తార ఈమెలా భువికి చేరింది.. మెస్మరైజ్ శ్రీనిధి..

16 December 2024

Battula Prudvi

16 జూన్ 1995న కేరళ రాష్ట్ర రాజధాని, ఆధ్యాత్మిక నగరమైన తిరువనంతపురంలో జన్మించింది అందాల భామ తన్వి రామ్.

బెంగుళూరులో బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నటన వైపు దృష్టి సారించింది.

2019లో జాన్పాల్ జార్జ్ దర్శకత్వంలో అంబిలి అనే మలయాళీ కామెడీ డ్రామా చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది.

తర్వాత 2020లో మలయాళీ సోషల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం కప్పెల సినిమాలో కథానాయకిగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

2022లో నాని హీరోగా వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ అంటే సుందరినికితో తెలుగు తెరకు పరిచయం అయింది.

అదే ఏడాది ఆరాట్టు, తాళ్లుమాల,కుమారి, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అనే నాలుగు మలయాళీ సినిమాల్లో కనిపించింది.

2023లో ఎంకిలుమ్ చంద్రికే, ఖలీ పర్స్ అఫ్ బిలియనీర్స్ సినిమాల్లో నటించింది. అదే ఏడాది వచ్చిన 2018 మూవీతో మంచి హిట్ అందుకుంది.

2024 దసరాకి వచ్చిన క సినిమాలో ముఖ్య పాత్రలో నటించి తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.